నాగార్జున సాగర్ కు భారీ వరద

 గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద ప్రవాహం భారీగా పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్‌కు 4లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. డ్యామ్‌కు ప్రస్తుతం 4,49,433 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తండగా అధికారులు 20 గేట్లు ఎత్తి వేసి, దిగువ‌కు 4,49,433 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. 
ఎగువన మహారాష్ట్ర, కర్నాటక, ఏపీల మీదుగా వరద పోటెత్తుతుండడంతో వస్తున్న వరద ప్రవాహాన్ని నిల్వ చేసే అవకాశం లేక వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి వరకు 18 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన అధికారులు ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో రెండు గేట్లు దించి మొత్తం 16 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో   3 లక్షల 70 వేల 757  క్యూసెక్కులు వస్తుండగా వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగ‌ర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుద‌ల చేస్తుండ‌డంతో కృష్ణా న‌ది ప‌రీవాహ‌క ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులతో 312.0405 టీఎంసీల కాగా ప్రస్తుతం  587 అడుగుల నీటి మట్టంతో  305.8030  టీఎంసీలు నిల్వ ఉంచుతున్నారు. ఎగువన శ్రీశైలం నుండి వరద తగ్గితే అందుకు అనుగుణంగా సాగర్  డ్యామ్ వద్ద కూడా  గేట్లు కూడా దించి వరదను కంట్రోల్ చేస్తున్నారు.