అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి తేలకుండా కొనసాగుతున్న కోర్ట్ వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీం కోర్ట్ లో చివరకు సానుకూలమైన తీర్పు సాధించడంలో కీలక భూమిక వహించిన న్యాయకోవిదుడు పరాశరన్ ఇప్పుడు అమరావతి రైతుల పక్షం వహించడానికి సిద్దపడుతున్నారు.
సుమారు 250 రోజులుగా అమరావతి ప్రాముఖ్యతను రాజధానిగా నిర్వీర్యం చేయడం కోసం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా నిరసన దీక్షలు చేబడుతున్న ఆ ప్రాంత రైతుల పక్షాన సుప్రీం కోర్ట్ లో వాదనలు వినిపించడానికి సమాయత్తం అవుతున్నారు.
90 ఏళ్లకు పైగా వయస్సులో ఉన్న పరాశరన్ అమరావతి రైతుల దుస్థితి గురించి తెలుసుకొని ఆవేదన చెందారని చెబుతున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు చేస్తోన్న ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తమ రాష్ట్రానికి నూతన రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశామని రైతులు వాపోతున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజైన్ లతో కాలక్షేపం చేసి కీలక నిర్మాణాపు చేయకుండా వదిలి పోతే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అసలు అమరావతికె ఎసరు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
దాదాపు 6నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా తమ గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. దానితో రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు తలుపూ తట్టారు అమరావతి రైతులు. ఈ నేపథ్యంలో తాజాగా రైతుల తరఫున వాదించేందుకు పరాశరన్ ముందుకు వచ్చారు.
దశాబ్దాలపాటు నలిగిన అయోధ్య రామమందిరం కేసు వంటి ప్రతిష్టాత్మక కేసులను వాదించిన పరాశరన్ అమరావతి రైతులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు అంగీకరించారు. 2, 3 రోజుల క్రితం రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన వాదనల్లోనూ పరాశరన్ పాల్గొన్నారు.
భారీ స్థాయిలో ఫీజు చెల్లించుకోలేని అమరావతి రైతులు న్యాయం కోసం పోరాడే పరాశరన్ వంటి ప్రముఖ న్యాయవాదులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దానితో ఆయన కేవలం ఒక్క రూపాయి ఫీజుకే అమరావతి రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు సిద్ధమయ్యారని రైతులు చెబుతున్నారు.
మంది లాయర్లు కూడా ఉచితంగా రాజధాని రైతు. పరాశరన్‌తో పాటు కొంత ల కోసం వాదించేందుకు ముందుకు వచ్చారు. పరాశరన్‌తో పాటు కొంత మంది లాయర్లు కూడా ఉచితంగా రాజధాని రైతుల కోసం వాదించేందుకు ముందుకు వచ్చారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూతురు కిరణ్ బాబ్డే కూడా అమరావతి రైతుల తరఫున ఇప్పటిే హైకోర్టులో వాదించారు. ఆమె కూడా అమరావతి రైతుల వైపునే ఉన్నారు. ఇలా, దిగ్గజ న్యాయవాదులు తమ పక్షాన నిలబడడంతో అత్యున్నత న్యాయస్థానాలలో తమకు న్యాయం జరగగలదనే భరోసా అమరావతి రైతులలో వ్యక్తం అవుతున్నది.
More Stories
సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాల్సిందే!
తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి