
అబ్దుర్ రహమాన్‌ను ప్రశ్నించినపుడు తాను జహాన్‌జెయిబ్ సమితోనూ, సిరియాలోని మరికొందరు ఐసిస్ ఉగ్రవాదులతోనూ కలిసి పని చేస్తున్నట్లు అంగీకరించాడని ఎన్ఐఏ తెలిపింది.
సురక్షితమైన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తాము పరస్పరం సంభాషించుకుంటున్నట్లు తెలిపాడని పేర్కొంది. భారత దేశంలో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడని పేర్కొంది.
ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో గాయపడే ఐసిస్ ఉగ్రవాదులకు సహాయపడేందుకు ఓ మెడికల్ అప్లికేషన్ (యాప్)ను, ఐసిస్ ఉగ్రవాదుల కోసం ఆయుధాలకు సంబంధించిన యాప్‌ను తయారు చేసే పనిలో రహమాన్ ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
రహమాన్ 2014లో సిరియా వెళ్ళినట్లు, అక్కడ ఐసిస్ మెడికల్ క్యాంప్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు చికిత్స చేసినట్లు వెల్లడైంది. 10 రోజులపాటు ఆ శిబిరంలో చికిత్సలు అందించి తిరిగి భారత దేశానికి వచ్చినట్లు తెలిసింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌కేపీ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కేసులో గతంలో జహాన్‌జెయిబ్ సమి వని, ఆయన భార్య హీనా బషీర్ బేగ్, అబ్దుల్ బాసిత్, సదియా అన్వర్ షేక్ అరెస్టయ్యారు. తాజాగా అబ్దుర్ రహమాన్ అరెస్టయ్యాడు.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
ఈ నెల 29న సూర్యగ్రహణం