తైవాన్ కు అమెరికా జెట్ ఫైటర్లు

చైనాకు తగిన బుద్ది చెప్పేందుకు అమెరికా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  చైనాకు వ్యతిరేకంగా తైవాన్ ను బలోపేతం చేసేందుకు యుద్ధ విమానాలను తయారుచేసి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నది. ఇందుకుగాను రానున్న పదేండ్లపాటు ఎఫ్ -16 విమానం ఆధునిక వెర్షన్‌ను నిర్మించడానికి అమెరికా తన యుద్ధ విమానాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌కు 62 బిలియన్ డాలర్ల (రూ. 4.65 లక్షల కోట్లు) కాంట్రాక్టు ఇచ్చింది. 
 
ఆగస్టు 14 న లాక్‌హీడ్ మార్టిన్‌కు ఇచ్చిన ఉత్తర్వులలో అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఏ దేశం పేరును ప్రస్తావించలేదు. అయితే ప్రస్తుతం తయారుచేయాలనుకున్న 66 విమానాలలో 2019 లో తైవాన్‌తో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కోసం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. 
 
ఈ విమానాలను కొనుగోలు ఆర్డర్ ప్రకారం 2026 డిసెంబర్ 31 లోగా తయారు చేయనున్నారు. 90 విమానాలను మొత్తం 62 బిలియన్ డాలర్ల ఖర్చుతో తయారుచేయనున్నారు. ఇందులో 66 జెట్ ఫైటర్లను తైవాన్ కు, మిగిలిన 24 విమానాలను మొరాకోకు పంపే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి మొరాకో అమెరికాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నది.
 
తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల అమెరికా ఆరోగ్య మంత్రి అలెక్స్ ఐజెర్ తైవాన్ సందర్శించారు. గత 40 ఏండ్లలో అమెరికా మంత్రి తైవాన్‌ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇది చైనాను మరింత రెచ్చగొట్టింది. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా పేర్కొనడం వల్ల మరే దేశమూ తైవాన్ తో దౌత్య, సైనిక సంబంధాన్ని కలిగి ఉండదు.
 
మరోవైపు, చైనా చేసిన ఈ అసంబద్ధ వాదనను తైవాన్ అంగీకరించదు. ఈ వాదనను పెంచడానికి భద్రతా విషయాలలో తైవాన్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇటీవల తూర్పు లడఖ్‌లో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సమయంలో కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్న మొదటి దేశం తైవాన్ కావడం గమనార్హం. 
 
అమెరికా ప్రతినిధి బృందం సందర్శించినప్పుడు చైనా ఫైటర్ జెట్‌లు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. వీటిని నిలువరించేందుకు తైవాన్ వైమానికదళం ప్రయత్నించగా తప్పించుకున్నాయి.