కాంగ్రెస్ లో ఒకే కుటుంభం, బీజేపీలో పలు తరాలు 

ప్రాంజల్ చౌదరి

భారతదేశ రాజకీయ ప్రక్రియలో రెండు పెద్ద పార్టీలు గత 16 ఏళ్లలో విపరీతమైన మార్పులకు గురయ్యాయి. 2004 నుండి 2014 వరకు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారాన్ని ఆస్వాదించగా, జ్యోతిరాదిత్య సింధియా, గౌరవ్ గొగోయ్, సచిన్ పైలట్ వంటి తరువాతి తరం నాయకులను ప్రోత్సహించడంకోసం విశేషమైన ప్రయత్నం చేశారు.

ఈ పదేళ్ల అధికారంలో, తన తల్లి, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తరువాత కాంగ్రెస్‌లో తదుపరి కీలక అధికార కేంద్రంగా భావించిన రాహుల్ గాంధీ నీడలో పనిచేయమని ఈ నాయకులను కోరారు.  కాంగ్రెస్ లోని సీనియర్ తరాలన్నీ సోనియా పంచన చేరగా,  ఈ యువ తరం నాయకులు రాహుల్ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆధిపత్యం సాధించేందుకు సిద్ధంగా ఉంటూ వచ్చారు.

వారు అధికారంలో ఉన్నంత వరకు పార్టీ లోపల అంతా బాగానే జరిగింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన వెంటనే, పురాతన పార్టీకి కష్టమైన దశ వచ్చింది. 2014 లో లోక్‌సభలో 44 మంది సభ్యుల పార్టీగా  అధికారం నుండి తరిమివేయబడే సరికి యువ తరం ప్రతికూలతను ఎదుర్కోవడం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ పార్టీలో వ్యవస్థాగతంగా విఫలమయ్యారు.

అయినప్పటికీ, పార్టీని తన ప్రైవేట్ ఆస్తిగా కలిగి ఉన్న కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఈ వాస్తవాన్ని ఎవరూ అంగీకరించలేరు. క్రమంగా, పార్టీలో అంతరాలు మొదలవుతున్నాయి. రాహుల్ గాంధీకి చెందిన ఈ యువ టర్క్‌లు సోనియా గాంధీ వర్గానికి చెందిన సీనియర్‌లతో సర్దుబాటు చేసుకోలేక పోతున్నారు.

ఇటీవలి కాలంలో, కాంగ్రెస్ లో చాలా మంది యువ నాయకులను పార్టీ పక్కనపెట్టడమో లేదా విస్మరించడమో చేస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తును నిర్ధారించడానికి ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. 

కాంగ్రెస్ లో అగ్రనాయకులకు  అవే చివరి ఎన్నికలు కావచ్చు. భవిష్యత్ కు మార్గం ఏర్పరచుకోవడం కోసం తర్వాతి నాయకులకు అవకాశం క్రమపద్ధతిలో ఏర్పరచే ప్రయత్నం చేయవలసింది. కానీ ఆ విధంగా జరగడం లేదు.

బిజెపిలో పరిస్థితి పూర్తిగా అంతుకు భిన్నంగా ఉంది. 2004 లో ఓటమి తరువాత 2009 లోక్ సభ ఎన్నికల వరకు పార్టీ నిజంగా కష్టతరమైన రోజులను ఎదుర్కొంది. బిజెపిలో బలమైన నేత  ప్రమోద్ మహాజన్ ఆకస్మిక మరణంతో, అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయాల నుండి 2005 లో పదవీ విరమణ చేయడంతో, పార్టీని నడిపించే బాధ్యత కె అద్వానీపై పడింది.

2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో బిజెపి కూడా ఆ తర్వాత 5 సంవత్సరాలలో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంది. యుపిఎ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ బిజెపి క్రమంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన తరువాతి తరం నాయకులను ప్రోత్సహించింది. 2012 లో మోదీ  జాతీయ స్థాయికి ఎదగడంతో  2014 లో తిరిగి అధికారంలోకి రావాలన్న బలమైన ఆశలను బిజెపిలో చిగురించాయి.

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజనాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ పారికర్ వంటి బలమైన నాయకులు బిజెపిలో ఒక జట్టుగా నరేంద్ర మోదీ  వెనుక నిలిచారు. దీని ఫలితంగా బిజెపి 2014 లోక్‌సభ ఎన్నికలలో  పోరాడి, భారీ తేడాతో విజయం సాధించ గలిగింది.

ఇంతలో, బిజెపిలో మంత్రులుగా ఎదిగిన అమిత్ షా, జె.పి.నడ్డా, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు వంటి అంతకన్నా యువతరం నాయకులను సృష్టించారు. ఈ సమయంలో, బిజెపి చాలా క్రమపద్ధతిలో తన భవిష్యత్ కాలానికి మరో తరం నాయకత్వానికి మార్గం ఏర్పాటు చేసింది.

భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని యోగి ఆదిత్యనాథ్, కిషన్ రెడ్డి, హిమంత బిస్వా శర్మ, సర్బానంద సోనోవాల్, అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, దేవేంద్ర ఫడ్నవిస్, బాబుల్ సుప్రియో వంటి యువ ముఖాలకు తమ రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించారు.

2020 జనవరిలో అమిత్ షా నుంచి జెపి నడ్డా బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో, కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులు  కనిపించాయి. రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ కాకుండా కాంగ్రెస్ తన భవిష్యత్ నాయకత్వాన్ని సృష్టించడంలో విఫలమవుతున్నప్పుడు బిజెపి తన భవిష్యత్ తరాలను ఎలా బలపరుస్తుందో చూడటం చాలా ఆసక్తి కలిగిస్తుంది.

ఇటీవల సింధియా ఓడలపైకి దూకడం, పైలట్ రాజస్థాన్‌లో అవాంతరాలను సృష్టించడం వంటివి స్పష్టంగా కాంగ్రెస్‌లోని పగుళ్లను ఎత్తిచూపాయి, ఇక్కడ సోనియా గాంధీ పట్ల విధేయత కొనసాగించే పాత గుర్రాల నుండి యువ నాయకులు పార్టీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.