దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

సరిహద్దుల్లో భారత్ పై దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని లడఖ్‌ సెక్టార్‌‌లోని సరిహద్దులో చైనాతో సరిహద్దు ఉద్రికత్తతలు తగ్గక పోవడం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. 

దేశ సైనికుల పరాక్రమాలపై తనకు మీద పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. భారత్ భూభాగంలో ఎవరూ ఒక్క ఇంచు భూత్య్ర మినీ కూడా  ఆక్రమించలేరని తేల్చి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేడియోలో సైనికుల గురించి రాజ్‌నాధ్  పలు విషయాలు మాట్లాడారు. 

సైనికుల ధైర్య, సాహసాల వల్లే దేశం సురక్షితంగా ఉందని రక్షణ మంత్రి భరోసా వ్యక్తం చేశారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న సైనికులను కొనియాడుతూ దేశంపై ఎవరైనా సాహసం చేసి దాడి చేస్తే మాత్రం గతంలో లాగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాలు దాదాపు లక్ష మంది సైనికులను మోహరించాయని తెలుస్తున్నది. దీంతో బార్డర్‌‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. `జాతీయ భద్రతలో భాగంగా మేం ఏం చేసినా అది ఆత్మ రక్షణ కోసమే తప్ప ఇతరులపై దాడి చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు. 

భారత్  ఏ దేశంపై కూడా దాడి చేయలేదని, అలాగే ఏ దేశం కూడా భారత్‌ను ఆక్రమించుకోలేదని చరిత్ర చెబుతోందని రక్షణ మంత్రి గుర్తు చేశారు. “అయితే దీనర్థం మా ఆత్మగౌరవానికి  భంగం కలిగిస్తే ఊరుకుంటామని కాదు. దేశాన్ని కాపాడిన వీర సైనికుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరువబోరు. వాళ్ల కుటుంబాలు ఒంటరి కావు. దేశం మొత్తం వాళ్లకు అండగా ఉంటుంది”  అని రాజ్‌నాథ్ వివరించారు.