కొవిడ్ -19 కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే దశలవారీగా ప్రారంభించాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను సెప్టెంబరు 5 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిందని గుర్తు చేశారు.
ఒకే సారి కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించడం వల్ల లక్షలాది సంఖ్యలో విద్యార్ధులు కలుస్తారని, ఇప్పటికే రోజూ అత్యధికంగా నమోదవుతున్న కరోనా కేసులు మరింత బాగా పెరిగిపోయి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో ఇలాగే ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించినందువల్ల 80 వేల వరకు కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మీద ఆధారపడి 60 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారని, బస్సులు ప్రారంభించకుండా ఎలా విద్యాసంస్థలకు వస్తారని వీర్రాజు ప్రశ్నించారు.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్