
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన మొదటి భారతీయ, ఆఫ్రో అమెరికన్ మహిళ కమలాహారిస్‌పై వివాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఆమె అమెరికాలో పుట్టలేదని, ఉపాధ్యక్ష పదవికి అర్హురాలు కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. కమల నైతికంగా, మేధోపరంగా దిగజారిన మనిషి అని ఆరోపించింది.
స్వయంగా ట్రంప్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ‘కమలకు అర్హత (ఉపాధ్యక్ష పదవికి) లేదని చెప్తున్నారు. ఆ మాటలు అన్నది కూడా గొప్ప ప్రతిభావంతుడైన, ఉన్నత విద్యావంతుడైన న్యాయవాది. అది నిజమోకాదో నాకైతే తెలియదు. ఆమెను ఎంపికచేసుకొనేముందు డెమోక్రాట్లు అన్ని వివరాలు పరిశీలించుకొని ఉండాల్సింది. ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిని నేను పరిశీలిస్తాను’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే రిపబ్లికన్ల ఆరోపణలను జో బిడెన్ బృందం తిప్పికొట్టింది. కమల పుట్టుక వివరాలపై అర్థంపర్థంలేని వివాదాలు సృష్టిస్తున్నారని బిడెన్ ప్రచార జాతీయ కమిటీ సభ్యుడు అజయ్ భుటోరియా ధ్వజమెత్తారు.
`మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టే వ్యక్తులు 1787 తర్వాత అమెరికాలోనే జన్మించి పుట్టుకతో సహజ పౌరసత్వం పొందినవారై ఉండాలి. కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో జన్మించారు’ అని స్పష్టం చేశారు.
More Stories
క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు