పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ మయన్మార్లో ఉగ్రవాద గ్రూపులకు శిక్షణ ఇస్తున్నట్లు బైటపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశాలను అస్థిరపరచాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాచారాన్ని దక్షిణ ఆసియా డెమోక్రటిక్ ఫోరం విశ్లేషకుడు సిగ్‌ఫ్రైడ్ ఓ వోల్ఫ్ జర్మన్ వార్తా సంస్థ డీడబ్ల్యూలో వెల్లడించారు.
ఆయన తెలియజేసిన వివరాలిలా ప్రకారం జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ద్వారా 40 మంది రోహింగ్యాలకు ఐఎస్ఐ శిక్షణ ఇస్తున్నది. 2016 లో ఢాలోని ఒక కాఫీ షాప్ పై జేఎంబీ దాడి చేసిన ఘటనలో 22 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు.
మూడో దేశం ద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ ఇష్టపడుతున్నది. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుందని స్పష్టం చేస్తున్నది. మయన్మార్ సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ కాక్స్ బజార్ ఉగ్రవాద గ్రూపులకు లక్ష్యంగా మారింది.
గతంలో ఉగ్రవాద రోహింగ్యాలు కొన్ని ప్రయత్నాలు చేశారని బంగ్లాదేశ్ భద్రతా నిపుణుడు అబ్దుర్ రషీద్ చెప్పారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిని నిలువరించింది. ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడం ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించవచ్చు.
అయితే, బంగ్లాదేశ్ మాత్రం అటువంటి కార్యకలాపాలు జరగడానికి అనుమతించదు. మయన్మార్ సైనిక అధికారుల వెల్లడించిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న రోహింగ్యా తిరుగుబాటు బృందం అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) తన కార్యకలాపాలను ఇటీవల పెంచింది. ఏఆర్ఎస్ఏ సభ్యులు శరణార్థి శిబిరాల్లో చురుకుగా ఉన్నారు. పాకిస్తాన్ వారికి సహాయం చేస్తున్నది.
ఏఆర్ఎస్ఏ నాయకుడు అటౌల్లా పాకిస్తాన్లో జన్మించి, సౌదీ అరేబియాలో పెరిగాడు. అతను, అతడి బృందానికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) శిక్షణ ఇచ్చింది. ఏఆర్ఎస్ఏ, జేఎంబీ సంస్థలు రెండు అనుసంధానించబడ్డాయి. ఆయుధ శిక్షణ సమయంలోని అతడి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!