
హెచ్1బీ వీసాదారులకు అమెరికా ఊరట కల్పించింది. ఆ వీసా ఉన్నవాళ్లు పాత ఉద్యోగమే కొనసాగించేందుకు ట్రంప్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీసా నిషేధానికి ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో అదే ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి కల్పించారు.
హెచ్1బీ వీసాదారులపై ఆధారపడేవాళ్లు, జీవితభాగస్వాములు, పిల్లలు కూడా అమెరికా ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చారు. టెక్నికల్ స్పెషలిస్టులు, సీనియర్ లెవల్ మేనేజర్లు, ఇతర వర్కర్లకు ఈ సడలింపులో అవకాశం కల్పించారు.
అమెరికాలో వీసా నిషేధం కన్నా ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో అదే ఉద్యోగాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ అడ్వైజరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థను త్వరతిగతిన గాడిలో పడేందుకు టెక్నికల్ స్పెషలిస్టులు, సీనియర్ లెవల్ మేనేజర్లు అవసరం అన్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నది.
హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్నవారిపై జూన్ 22వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా కార్మికులను రక్షించుకునేందుకు ఈ ఏడాది చివరి వరకు వీసా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అయితే ట్రంప్ ప్రభుత్వ ప్రణాళికల
More Stories
హెచ్ -1 బి వీసా కార్యక్రమంలో పలు మార్పులు
హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్
యూకే పార్లమెంట్లో చిరంజీవికి సత్కారం