
సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడిపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కత్తి మహేష్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మహేష్ ను అరెస్ట్ చేశారు.
ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కొన్ని నెలల క్రితం కత్తి మహేష్ ఫేస్ బుక్, ట్విటర్ లో శ్రీరాముడి గురించి (రాముడు కరోనా ప్రియుడు) అసభ్యకర పోస్ట్ లు పెట్టిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు కత్తి మహేష్ పై పలు చోట్ల కేసులు పెట్టాయి. వారి ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పలుమార్లు కత్తి మహేష్ ను విచారించారు. శుక్రవారం మరోసారి విచారించిన పోలీసులువిచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు.
కొన్నేళ్లుగా కత్తి మహేష్ వార్తల్లో ఉంటున్నాడు. గతంలో పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్ లో ఓసారి దాడి కూడా జరిగిన విషయం తెలిసిందే.
More Stories
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు
25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’