ప్ర‌‌శాంత్ భూష‌ణ్ క్ష‌మాప‌ణ‌ల‌ తిరస్కరించిన సుప్రీం  

ప్ర‌‌శాంత్ భూష‌ణ్ క్ష‌మాప‌ణ‌ల‌ తిరస్కరించిన సుప్రీం  
న్యాయ‌మూర్తులంతా అవినీతిప‌రులంటూ 2009లో న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో ప్ర‌శాంత్ ఇచ్చిన వివ‌ర‌ణ‌, క్ష‌మాప‌ణ‌ల‌ను ఇవాళ సుప్రీం కోర్ట్ తిర‌స్క‌రించింది. న్యాయ‌మూర్తుల‌ను అవినీతిప‌రులంటూ ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు కోర్టు ధిక్క‌ర‌ణ కింద వ‌స్తాయా లేదా అన్న కోణంలో సుప్రీం విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. ఈ కేసును మ‌ళ్లీ సోమ‌వారం విచారించ‌నున్న‌ది. 
 
2009లో తెహ‌ల్కా పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో 16 మంది న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిప‌రులే ఉన్నారంటూ ప్రశాంత్ ఆరోపించారు. న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌పై న‌మోదు అయిన మ‌రో కోర్టు ధిక్క‌ర‌ణ కేసును కూడా సుప్రీం ప‌రిశీలిస్తున్న‌ది. 
 
ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేపై ప్ర‌శాంత్ ఇటీవ‌ల కామెంట్ చేశారు.  బోబ్డే బైక్‌ను తొల‌డాన్ని ప్ర‌శాంత్ త‌ప్పుప‌డుతూ ట్విట్ట‌ర్‌లో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.  అయితే భావ స్వేచ్చ‌కు, కోర్టు ధిక్క‌ర‌ణ‌కు స్వ‌ల్ప తేడా ఉన్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.  
 
నా మాట‌ల వ‌ల్ల ఎవ‌రు ఇబ్బందిప‌డ్డా, సీజేఐలు లేదా వారి కుటుంబ‌స‌భ్యుల‌కు తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు  ప్ర‌శాంత్ ఓ ప్ర‌క‌ట‌న తెలిపారు. ప్రశాంత్ 
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చురించిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు త‌రుణ్ తేజ్‌పాల్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.