వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
సాంబశివరాజు రెండు సార్లు మంత్రిగా, ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్‌గా సాంబశివరాజు ఎన్నికయ్యారు.
1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. అయితే 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందినప్పటికీ వైసీపీలోకి వచ్చిన సాంబశివరాజుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు కరువైంది.
More Stories
హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం
వైజాగ్ స్టీల్ప్లాంట్ జఠిలమైన సమస్య
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల