
చైనా కు గూగుల్ షాక్ ఇచ్చింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పై నకిలీ సమాచారం తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ చానెల్స్ పై దృష్టి సారించింది. చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది. వీటిని ఏప్రిల్ – జూన్ మధ్య తొలగించినట్లు పేర్కొన్నది.
భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా వీటి తొలగింపు చోటు చేసుకుంది.
అయితే కరోనా తర్వాత చైనా యాప్స్, యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది. దీనిపై స్పందించాలని కోరగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెంటనే రెస్పాండ్ కాలేదని తెలుస్తున్నది.
అయితే గతంలో ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఖండించింది. గతంలో ఇతర దేశాలతో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు సందేశాలు పంపారనే ఆరోపణలు ఉన్నాయి.
More Stories
పాక్ లో ఐఎస్ఐలో రెండో అత్యున్నత అధికారి హతం
హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో చైనా – రష్యా