తొలి కరోనా వ్యాక్సిన్‌ దేశంగా రష్యా  

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసిన దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. ఈ వ్యాక్సిన్‌ను ఈనెల 12న రిజిష్టర్‌ చేయనున్నట్లు రష్యన్‌ ఆరోగ్య శాఖ ఉప మంత్రి అలెగ్‌ గ్రిడ్నేవ్‌ వెల్లడించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఆరోగ్య కార్యకర్తలకు, చిన్నారులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 

ప్రస్తుతం చివరిది అయిన మూడో దశ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫార్ములాపై క్లినికల్‌ ట్రయల్స్‌ మాస్కోలోని షెచెనోవ్‌ యూనివర్సిటీలో జూన్‌ 18న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అధ్యయనంలో 38 మంది వాలంటీర్లు పాలుపంచుకున్నారు. 

అని భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను అన్నిటిని ఇది పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గత వారం ఆరోగ్యశాఖ సీనియర్‌ మంత్రి మైఖెల్‌ మురాస్కో ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.