కరోనా ఉధృతి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంను పాక్షికంగా మూసివేశారు. తాజాగా మరో తొమ్మిది కేసులు బయటపడడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కేసులతో ఆరు శాఖల కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసి ఉద్యోగులను ఇళ్లకు రసాయన ద్రావణాన్ని పిచి
శని, ఆదివారాలుపంపేశారు. అనంతరం ఆయా శాఖల్లో సెలవు కావడం, మంగళవారం కృష్ణాష్టమి కావడంతో తిరిగి బుధవారం నుంచి దైనందిన విధులు ఆయా శాఖల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం సచివాలయంలో ఇప్పటివరకు 70 మంది వరకు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయం నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.
ఇలా ఉండగా ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,171 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1842కు చేరింది.
తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 2,06,960కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 434 మంది ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో 7,594 మంది కరోనాను జయించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,20,464 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 84,654 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో తాజాగా 62,938 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు 23,62,270 మందికి కరోనా పరీక్షలు జరిపారు.
More Stories
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో రెండు బ్యారేజీలు!