
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడం గమనార్హం. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం నాడు అట్రాసిటీ కేసు నమోదయ్యింది.
ఏకంగా ప్రభాకర్‌రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కాన్వాయ్ తో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకున్నారు.
ర్యాలీలకు ప్రస్తుత నిబంధనలు ఒప్పుకోవని సీఐ స్పష్టం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేశారు.
కాగా ఈ సందర్భంగా జేసీపై మొత్తం 5 కేసులు నదు చేసినట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు. అంతకు ముందు దళిత సీఐ దేవేంద్రను దూషించినట్లు జేసీపై ఆరోపణలు వచ్చాయి. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం ఉంది.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జేసీపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 52 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జేసీ అరెస్ట్ సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ఈ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
More Stories
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం
న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం
బీజేపీలో చేరిన కీలక జనసేన నేత