
2024 నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో బలమైన శక్తిగా రూపుదిద్దేందుకు ఒక ప్రణాళిక రచిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. శుక్రవారం జనసేకలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఉద్యమం చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.
కాగా, గురువారం మెగాస్టార్ చిరంజీవితో తన భేటీ గురించి ప్రస్తావిస్తూ ఆయనను బీజేపీలోకి ఆహ్వానించలేదని వీర్రాజు స్పష్టం చేశారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని పేర్కొన్నారు.
చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని జోస్యం చెప్పారు. త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాలవారిని కలసి బీజేపీకి మద్దతివ్వాలని కోరుతున్నామని, మాజీమంత్రి ముద్రగడ పద్మనాధం, వీవీ లక్ష్మీనారాయణ లాంటి వారిని సైతం కలుస్తానని సోమువీర్రాజు ప్రకటించారు.
వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలేనని తప్పుబట్టారు. అమరావతి రైతుల పక్షాన జనసేనతో కలసి పోరాడతామని వెల్లడించారు. అమరా
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం అని చెబుతూ అన్ని వనరులూ, సుధీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనసేన, బీజేపీ ఉన్నాయని వీర్రాజు చెప్పుకొచ్చారు.
రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. వాటికి కేంద్ర ఆలోచనలను మిళితం చేసి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పవన్ నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు