రామాలయం కోసం 28 ఏండ్లుగా మహిళ దీక్ష

అయో­ధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఒక మహిళ 28 ఏండ్లుగా నిరా­హార దీక్ష చేస్తు­న్నారు. అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్న తర్వాతే తన దీక్షను విర­మి­స్తా­నని ఆమె చెబు­తు­న్నారు. 
 
మధ్య­ప్ర­దే­శ్‌­లోని జబ­ల్‌­పూ­ర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేదికి ఇప్పుడు 82 ఏండ్లు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం జరిగిన మత ఘర్షణలతో ఆమె కలత చెందారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగే వరకు ఆహారం తీసుకోకూడదని నాడు నిర్ణయించుకున్నారు. 
 
నాటి నుంచి 28 ఏండ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కేవలం పాలు, పెరుగు, పండ్లు తింటూ జీవిస్తున్నారు. అయోధ్యలోని భవ్య రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అయోధ్యలోని రాముడ్ని దర్శించుకుని ఆ ప్రసాదంతో తన నిరాహార దీక్షను విరమిస్తానని ఊర్మిళ చతుర్వేది తెలిపారు.