అమెరికా ఆర్థికవ్యవస్థ చరిత్రలో అత్యంత కనిష్టస్థాయికి దిగజారింది. ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ)లో ఆర్థిక వ్యవస్థ 32.9 శాతం క్షీణించిందని ప్రభుత్వ గణాంకాలు చెబు తున్నాయి. ఇది గతంలో సంభవించిన తీవ్ర ఆర్థిక సంక్షోభం కన్నా చాలా ఎక్కువ. 1932లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం క్షీణించింది.
అలాగే రెండో త్రైమాసికంలో 20 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ‘2020 రెండో త్రైమాసికంలో అమెరికాయ జిడిపి చరిత్రలోనే అత్యంత వేగంగా పతనమైయింది’ అని ఎకనామిక్ పాలసీ ఇనిస్టి ట్యూట్ తెలిపింది.
కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగ ప్రయోజనాలు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజలు ఆహారం, ఇతర వస్తువుల కోసం క్యూ లైన్‌ల్లో నిలుచుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభం పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ