ఇందిరా గాంధీ చాలా బలహీన నేత 

భారతీయులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీని బలమైన నాయకురాలిగా భావిస్తూ ఉంటారని, కానీ  తన దృష్టిలో అనే చాలా బలహీన నాయకురాలని వాషింగ్ టన్ కేంద్రంగా పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రజల హక్కులకోసం పనిచేస్తున్న గిల్గిట్ బాల్తిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ డైరెక్టర్ సెంజీ షేరింగ్ స్పష్టం చేశారు. 
 
తత్త్వ టాక్స్  నిర్వహించిన వెబినార్ లో “చైనా సామ్రాజ్యవాదంను అర్ధం చేసుకోవడం” అంశంపై మాట్లాడుతూ 1971 యుద్ధంలో భారత్ సైనికులు తిరిగి ఆక్రమించుకున్న ఆక్రమిత కాశ్మీర్ లోని భూభాగాలను తిరిగి పాకిస్థాన్ కు ఇచ్చివేయడానికి అంగీకరిస్తూ సిమ్లా ఒప్పందంలో ఆమె సంతకం చేసారని గుర్తు చేశారు.
 
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ భూభాగాలను పాకిస్థాన్ భారత్ నుండి ఆక్రమించుకున్నదని, 1950లో ఆమోదించిన భారత దేశ రాజ్యాంగంలో ఆ భూభాగాలను తమవిగా భారత్ పేర్కొన్నదని ఆయన తెలిపారు. ఆ భూభాగాలను ఆక్రమించిన దురాక్రమణదారునిగా పాకిస్థాన్ ను నిందిస్తూ తిరిగి ఆ భాగాలను ఏ విధంగా ఆమె తిరిగి ఇచ్చారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 
 
ప్రపంచంలో మరే దేశమైన యుద్ధంలో తిరిగి స్వాధీనం చేసుకొన్న సొంత భూభాగాలను తిరిగి ఇచ్చివేస్తుందా అని ప్రశ్నించారు. 
ఆ నాడు ఆ భూభాగాలకోసం పట్టుబట్టే పరిస్థితులలో పాకిస్థాన్ లేదని, వాటిని భారత్ తనవద్దనే ఉంచుకొంటే నేడు కాశ్మీర్ లో సమస్యలు అంటూ ఉండేవి కావని స్పష్టం చేసారు. ఒకప్పుడు భారత దేశంలో భాగమైన గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రజలమైన తమను ఆమె పాకిస్థాన్ కు బందీలుగా చేసినదని ఆయన వాపోయారు. 
 
అంతర్జాతీయంగా కూడా ఆ ఆనాడు ఆ భూభాగాల విషయంలో భారత్ ను ఎవ్వరు ప్రశ్నించేవారు కాదని చెప్పారు. కానీ నేడు తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలి అనుకొంటే అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేశారు. 
ఆ భూభాగాలని ఆ నాడు ఇందిరా గాంధీ పాకిస్థాన్ కు ఎందుకు ఇచ్చివేసిందో ఇప్పటికి తనకు అర్ధం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.