‘‘మొజ్తాబా ఆరోగ్యం గురించి చాలా మంది అడుగుతుంటారు. అతడు ఎందుకు కనబడడు? ఒక ఆడియో లేదా వీడియో సందేశం ఎందుకు పంపించడు..? ఇతరులు ఎవరూ ఆయనను ఎందుకు కలవరు.. కలిసి మాట్లాడారు..? ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఇదంతా శత్రువుల ఉపాయం. దీని ద్వారా మేం ఆయన గురించి మాట్లాడి, వెల్లడిస్తే.. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు” అంటూ ఆరోపించారు.
“ప్రస్తుతం మా అందరి లక్ష్యం ఆయనను రక్షించుకోవడమే. దేవుడు ఉన్నాడు అనేందుకు మొజ్తాబాయే సాక్ష్యం. గాయపడ్డప్పటికీ ఆయన కోలుకున్నారు. షియాలకు ప్రతినిధిగా దేవుడు ఆయనను రక్షించాడు. మొజ్తాబా ఉన్న బిల్డింగ్‌పైనే బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో అక్కడి వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఈ బాంబు పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆయన ఆ బిల్డింగ్ నుంచి కోర్డ్ యార్డుకు చేరుకున్నారు” అని వెల్లడించారు.
“దేవుడు ఆయనను రక్షించాలని భావించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉండి, అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అమెరికాతో చర్చలు, సైనిక నిర్వహణ వంటి అంశాల్ని సమీక్షితున్నారు” అంటూ ఖోమి చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడి ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని సహా పలువురు కుటుంబ సభ్యులు మరణించారు.
అయితే, ఈ ఘటనలో మొజ్తాబా ఖమేని మాత్రం తప్పించుకుని బయటపడ్డట్లు ప్రచారం జరిగింది. ఆయన గాయపడ్డారని, రహస్యంగా చికిత్స పొందుతున్నారని ట్రంప్ చెప్పారు. తాజాగా, ఆయన సన్నిహితుడు ఈ అంశంలో ఒక ప్రకటన చేశారు. “అమెరికా దాడిలో ఖమేనీకి గాయాయ్యాయి. ఇప్పుడు ఇరాన్ అధికారులు సర్వోన్నత నాయకుడి ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించారు.
“ప్రస్తుతం భూమిపై దైవసాక్షిగా ఉన్న గౌరవనీయులైన నాయకుడి ప్రాణాలను కాపాడటమే మాకు అత్యంత ముఖ్యమైన విషయం తెలిపారు. ఆయనకు గాయాలైనప్పటికీ, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను షియాలకు ఒక నిధిగా కాపాడాడని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని ఖోమీ తెలిపారు. బాంబు దాడి జరిగిన భవనంలోనే మొజ్తాబా ఖమేనీ ఉన్నారని, అయితే చివరికి ఆయన ప్రాణాలతో బయటపడ్డారని ఖోమి ధృవీకరించారు.
పేలుడు జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు, దైవ సంకల్పం వల్ల ఆవరణలోకి వెళ్ళాడని, దేవుడు అతన్ని కాపాడాలని కోరుకున్నాడని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన వ్యవహారాలను చురుకుగా నిర్వహిస్తున్నారని, ఆయన తన ప్రత్యక్ష పర్యవేక్షణతో చర్చలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తున్నారని ఖోమీ వెల్లడించారు.

More Stories
క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
కేరళలో యూడీఎఫ్ గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ముస్లిం లీగ్!
ఇరాన్ రవాణాకు పాక్ ద్వారా ఆరు ప్రత్యేక భూమార్గాలు!