నాగ్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన భారత్  

ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దులో ప్ర‌స్తుతం చైనాతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త్ నాగ్ మిస్సైల్‌ను ప‌రీక్షించింది.  హెలికాప్ట‌ర్ నుంచి లాంచ్ చేసే నాగ్ మిస్సైల్‌ను ప‌రీక్షించారు.  ఈ క్షిప‌ణిని ఇప్పుడు ద్రువాస్త్ర యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌గా పిలుస్తున్నారు. 

ఒడిశాలోని ఐటీఆర్ బాల‌సోర్ వ‌ద్ద ఈ ప‌రీక్ష జ‌రిగింది. ఈనెల 15, 16వ తేదీల్లో జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నాగ్ మిస్సైల్ వీడియోను రిలీజ్ చేశారు.  అయితే ఈ ప‌రీక్ష‌ను హెలికాప్ట‌ర్ స‌హాయం లేకుండానే చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

నాగ్ మిస్సైల్‌ను క‌నీసం 500 మీటర్ల దూరం నుంచి గ‌రిష్టంగా 20 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దు.  దీని వేగం గంట‌కు 828 కిలోమీట‌ర్లు.  అయితే వేరియంట్లను బ‌ట్టి నాగ్ క్షిప‌ణి రేంజ్ ఉంటుంది. తాజాగా బా‌ల‌సోర్‌లో ప‌రీక్షించింది హెలినా వేరియంట్‌.  దీంట్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 

ఒక‌టి రుద్రాస్తా, మ‌రొక‌టి ద్రువాస్తా హెలినా క్షిప‌ణులు.  7 కిలోమీట‌ర్ల రేంజ్ నుంచి 20 కిలోమీట‌ర్ల రేంజ్‌లో ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌వు. టార్గెట్‌ను లాక్ చేసిన త‌ర్వాత‌నే మిస్సైల్ రిలీజ్ అవుతుంది. అమెరికాకు చెందిన జావెలిన్‌, ఇజ్రాయిల్‌కు చెందిన స్పైక్ క్షిప‌ణులు.. నాగ్ మిస్సైల్‌కు స‌మానంగా నిలుస్తాయి.