రాజధానిగా అమరావతే  కొనసాగించాలి 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి  సమర్పించిన రెండు వినతి పాత్రలలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. మొదటి పత్రంలో తన వ్యక్తిగత భద్రతకు కేంద్ర బలగాలను కోరినా, ప్రధానంగా రాజధాని అంశంపైననే కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. 

రాష్ట్ర శాసనసభ ఆమోదం పొంది, శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టలేకపోయిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుకు సంబందించిన రెండు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉన్న సమయంలో రాజు రాష్ట్రపతిని కలవడం ప్రత్యేకతను సంతరింప చేసుకొంది. 

పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టంకు విరుద్ధంగా ఉన్న ఆ బిల్లులకు ఆమోదం తెలుపవద్దని,  అటార్నీ జనరల్ నుండి న్యాయసలహ తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే బీజేపీ, టిడిపి, సిపిఐ గవర్నర్ కు లేఖలు వ్రాసాను. 

శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే.. ఆ బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండలి కార్యదర్శి మాత్రం దాన్ని పక్కన పెట్టారని రాజు రాష్ట్రపతి దృష్టికి తీసుకు వచ్చారు. బిల్లులు పాస్ కాలేదని ఏకంగా ఆవేశంలో శాసనమండలినే రద్దు చేసేశారని గుర్తు చేసారు. 

రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని ఈ సందర్భంగా రాజు చెప్పుకొచ్చారు. తాను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే  ఉందని పేర్కొన్నారు. తాను ప్రస్తావించక పోయినా కోర్ట్ ఉత్తరువుల గురించి కూడా రాష్ట్రపతి వాకబు చేశారని తెలిపారు. 

‘‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. అమరావతిని పలిపాలనా రాజధానిగా ఉంచాల్సిందే. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విధంగానే రాష్ట్రపతికి విన్నవించా” అని రాష్ట్రపతిని కలసిన తర్వాత తెలిపారు. అమరావతే రాజధానిగా ఉంటుందని తాడేపల్లిలో గృహప్రవేశం ద్వారా గతంలో జగన్ స్పష్టమైన భరోనా ప్రజలకు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.