ఏపీలో 50 వేల చేరువలో కరోనా కేసులు 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అధ్యధికంగా శనివారం అంతకు ముందు 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 5,041 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల చెరువులోకి వెళ్ళింది.

ఒక్కరోజే కరోనాతో 56మంది మరణించారు.   దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 49,650కు చేరుకోగా, కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 642కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో 26,118మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 22,890మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 15వేలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.