అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు

అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ప్రణాళికలు ర‌చిస్తున్న‌ట్లు భారత సైన్యం హెచ్చరించింది. అయితే యాత్ర శాంతియుతంగా జరిగేలా చూడడానికి సైన్యం సంసిద్ధ‌మై ఉంద‌ని భరోసా ఇచ్చింది. 

 9 రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ కమాండర్, బ్రిగేడియర్ వి.ఎస్. థాకూర్ మాట్లాడుతూ… జాతీయ రహదారి 44 లో ఎక్కడో ఒకచోట యాత్రను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు దాడికి పాల్ప‌డేందుకు యోచిస్తున్న‌ట్లుగా స‌మాచారం అందిన్నట్లు వెళ్ళైద్నచారు. 

దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. హ‌త‌మైన ఉగ్ర‌వాదుల్లో పాకిస్తాన్‌కు చెందిన వ‌లీద్ అనే ఉగ్ర‌వాది సైతం ఉన్న‌ట్లు తెలిపారు. ఇత‌ని ఎన్‌కౌంట‌ర్‌ యాత్ర ప్రారంభానికి ముందు  భద్రతా దళాలకు పెద్ద విజయమని పేర్కొన్నారు. 

ఈ నెల 21 న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి నాలుగు రోజుల ముందు ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తెలిపారు. అమరనాథ్ యాత్ర శాంతియుతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా జ‌రిగేందుకు సైన్యం స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.