
Microsoft co-founder Bill Gates speaks at the Economic Club of Washington's summer luncheon in Washington, DC, on June 24, 2019. (Photo by NICHOLAS KAMM / AFP) (Photo credit should read NICHOLAS KAMM/AFP/Getty Images)
భారత్ లోని ఫార్మా పరిశ్రమ చాలా మెరుగ్గా పనిచేస్తోందని బిల్‌గేట్స్ కితాబిచ్చారు. ఇతర వ్యాధులకు కనిపెట్టినట్లుగానే.. కరోనాకు కూడా వ్యాక్సిన్‌ను అందించాలన్న తపన భారత్ ఫార్మా పరిశ్రమకు ఉందని పేర్కొన్నారు.
‘భారత్‌కు చాలా సామర్ధ్యముంది. ప్రపంచానికి పెద్దమొత్తంలో మందులు, వ్యాక్సిన్‌లను అందించే సంస్థలు అక్కడే ఉన్నాయి. ప్రపంచంలొ మరెక్కడా లేనట్లుగా… పలు వ్యాక్సిన్‌లను భారత్‌లోనే తయారు చేశారు’ అని గుర్తు చేశారు.
కాగా భారత్ లోని ఫార్మా కంపెనీల్లో నీరం ఇన్‌స్టిట్యూట్ చాలా పెద్దది. దీంతో పాటు బయో ఈ, భారత్ బయోటెక్ తదితర సంస్థలు కూడా ఉన్నాయని వరించారు. కరోనా వ్యాక్సిన్ ను భారత్ త్వరలోనే ప్రపంచానికి అందిస్తుందని భావిస్తున్నానని బిల్‌గేట్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
More Stories
కాశ్మీర్ లో నదిలో బస్ పడి ఆరుగురు జవాన్ల మృతి
కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
అన్ని వేరియంట్లపైనా పనిచేసే బూస్టర్ టీకా