బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ బిజెపి నేత రవీందర్ రైనాకు కరోనా సోకడంతో రామ్ మాధవ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
రెండు రోజుల క్రితం తాను రవీందర్ రైనాకు కలిశానని, అందుకే స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు రామ్ మాధవ్ తెలిపారు. తాను ఐదు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, తనకు నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.
తన వల్ల ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. రవీందర్ రైనాను కలిసిన వారిలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కూడా ఉన్నారు. దీంతో మంత్రి కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్