భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయనుంది. సరిహద్దు ప్రాంతాల్ని మరితం బలోపేతం చేసేందుకు కేంద్రం అమ్మలపొదిలో అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటుంది.
ఇందులో భాగంగా భారతీయ సైన్యం ఇజ్రాయిల్ నుంచి స్పైక్ ట్యాంకర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
అత్యవసర ఆర్ధిక అధికారాల కింద సుమారు రూ.500కోట్లతో 12 స్పైక్ లాంచర్ యూనిట్లు, 200కి పైగా క్షిపణిలను పంపించాలని భారతీయ సైన్యంకు చెందిన ఉన్నతాధికారులు ఇజ్రాయిల్ ను కోరినట్లు సమాచారం.
కాగా బాలకోట్ వైమానిక దాడుల తరువాత అత్యవసర ఆర్థిక అధికారాల కింద గతేడాది పెద్ద సంఖ్యలో క్షిపణులు, లాంచర్లు కొనుగోలు చేసింది.
భారత్ ఈ క్షిపణులను పాకిస్తాన్ ముందు భాగంలో మొహరించగా, తాజాగా రూ.500కోట్లతో ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయనున్న క్షిపణులను చైనా భూభాగం ముందు భారత భూభాగంలో ఏర్పాటు చేయనుంది.

More Stories
జార్ఖండ్ నిరాహారదీక్షలో ఒకరు ఆసుపత్రికి .. చర్చలకు సీఎం ఆహ్వానం
ఆందోళన వద్దు, నేను మీతో ఉన్నా.. రెబెల్ ఎంపీలకు మోదీ భరోసా
నీట్ ప్రశ్నలను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు