
తమ అవసరాల కోసం చైనా ఎన్నో కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తుతూ ఆ దేశ ‘విస్తరణ విధానాలు’కు నిరసనగా లండన్ లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట భారత ప్రవాసులు, ఇరాన్ ప్రవాసులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే ) కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వెలుపల జరిగిన కార్యక్రమ బృందానికి బీజేపీకి చెందిన ఓవర్సీస్ ఫ్రెండ్ నాయకత్వం వహించారు.
‘చైనా బ్యాక్ ఆఫ్’, ‘టిబెట్ చైనాలో భాగం కాదు’, ‘డౌన్ విత్ చైనా’, మొదలైన నినాదాలతో జాతీయ జెండా, ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులు కనిపించారు. చైనా విస్తరణవాద విధానాల గురించి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఈ ప్రదర్శన ఒక భాగమని చెబుతూ వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలియజేయాలని బీజేపీ విదేశీ మిత్రుల అధ్యక్షుడు కుల్దీప్ శేఖవత్ ఈ సందర్భంగా పిలుపిచ్చారు.
గిల్గిట్-బాల్టిస్తాన్‌లో వనరులను దోపిడీ చేయడం మానుకోవాలని నిరసనకారులు చైనాను డిమాండ్ చేశారు. ఒక పీవోకే కార్యకర్త డాక్టర్ అమ్జాద్ అయూబ్ మీర్జా మాట్లాడుతూ, “చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా వెళుతున్నందున మేము చైనా దురాక్రమణకు గురవుతున్నాము, సీపీఈసీ ప్రాజెక్టును విస్తరించే లక్ష్యంతో 6,000 మంది చైనా సైన్యం, ఇంజినీర్లు పీవోకే లో తిష్ట వేశారు” అని తెలిపారు.
“టెహ్రాన్‌లో పాలనతో చైనాకు రహస్య ఒప్పందం ఉంది… కమ్యూనిస్ట్ చైనాతో ఒప్పందాన్ని ఖండించడానికి మేము ఇక్కడ ఉన్నాము… ఇలాంటి ఒప్పందాలు చేయడం ద్వారా చైనా మన సార్వభౌమ భాగాన్ని ఆక్రమిస్తుంది” అంటూ నిరసనకారుడు ఆందోళన వ్యక్తం చేశారు. “మా చౌక కార్మిక మార్కెట్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించికుంతుంది.. చైనా భారతదేశానికి హాని చేసింది. ఈ విషయంలో భారతీయులకు సంఘీభావం తెలుపుతున్నాం” అని పేర్కొన్నారు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు