ఉస్మానియాలో ఎక్కడ చూసినా చెత్త, చెదారం

ఉస్మానియా ఆస్పత్రిలో ఎక్కడ చూసినా చెత్త, చెదారం కనబడుతుందని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు కూడా లేద‌ని, ఇతర సదుపాయాలు ఏమీ లేవని ఆయన ఆసుపత్రి సందర్శించి విమర్శించారు. 
ఆసుప‌త్రిలో కొద్దిపాటి వ‌ర్షానికే నీళ్లు చేరాయని, నీళ్ళతో పాటు చెత్త కూడా చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి సూపరిండెంట్ ఇన్‌చార్జ్‌గా పాండు నాయ‌క్‌ని పెట్టారన్న రాజాసింగ్ఆ యనకు మర్యాద ఇవ్వడం కూడా తెలియదని విమ‌ర్శించారు. 

వర్షానికి నీళ్ళు చేరాయని, చెత్త కూడా ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిందననే విష‌యాన్ని తెలుప‌గా “మేము అన్ని చేస్తున్నాం, చూస్తున్నా”మని సమాధానం చెప్పడం తప్ప పని మాత్రం చేయడం లేద‌ని దుయ్యబట్టారు. న

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉస్మానియా ఆసుపత్రినీ మోడల్ ఆసుపత్రిగా చేస్తానని, కొత్త భవనాలు నిర్మిస్తానని మాటలు చెప్పారని రాజాసింగ్ గుర్తు చేశారు. అయితే కెసీఆర్ నిద్రపోతున్నారని విమర్శించారు. 

ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఉస్మానియా ఆస్పత్రి మాదిరిగా కాకుండా ఉండాలంటే సీఎం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్క‌డ వసతులు కల్పించాలని రాజాసింగ్ కోరారు.  అప్పుడే వాస్తవాలు తెలుస్తాయ‌ని చెప్పారు.