పాకిస్థాన్ కన్నా చైనా ప్రమాదకరం 

భారత్ కు పాకిస్థాన్ నుండికన్నా చైనా నుండి ఎక్కువ ప్రమాదం ఎదురు కాగలదని ఎన్సీపీ అధినేత, మాజీ ఉపప్రధాని శరద్ పవర్ హెచ్చరించారు. చైనా సైనిక శక్తి భారత్‌ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. 

ఆయన శివసేన పత్రిక ‘సామ్నా’ ఇంటర్వ్యూలో దేశ బధ్రకు సంబంధించిన అంశాలపై విశ్లేషిస్తూ  దేశానికి ప్రథమ శత్రువు పాకిస్తాన్‌ అని అందరు భావిస్తారు కానీ, పాక్‌ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేశారు.

చైనా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు ‌ జిన్‌పింగ్‌లు షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వడం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, చైనాను అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి, దేశ సమస్యను పరిష్కరించాలని  ఆయన సూచించారు.

 చైనా పాక్‌ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని,  నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్‌ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్‌ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని పవర్ ద్వజమెత్తారు.