కేరళ రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు పదేళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ మళ్లీ ఖాతా తెరిచింది. తాజాగా వెలువడ్డ అసెంబ్లీ ఫలితాల్లో ఆ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించి తమ ఉనికి చాటుకుంది. అయితే ఈ ఎన్నికల్లో నెగ్గిన ముగ్గురిలో ఇద్దరు అభ్యర్థులు గతంలో నరేంద్ర మోదీ కేబినెట్లో పనిచేసిన మాజీ కేంద్రమంత్రులే కావడం విశేషం. తాజా ఎన్నికల్లో బీజేపీ నేమోం, చాతన్నూర్, కాళకూటం నియోజకవర్గాల్లో సత్తా చాటింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేబీ ఒకటి కంటే ఎక్కువ సీట్లు నెగ్గడం ఇదే తొలిసారి.
ఆ పార్టీకి 2016లో తొలిసారి ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో నేమోం స్థానంలో పార్టీ సీనియర్ నేత రాజగోపాల్ ఒక్కరే విజయం సాధించారు. ఇక 2021లో ఆ సీటులో కూడా బీజేపీ ఓడిపోయింది. దీంతో గత అసెంబ్లీలో బీజేపీ ప్రానినిధ్యం లేకుండా పోయింది. కేరళ అసెంబ్లీ ఫలితాల్లో ఆసక్తి కనబర్చిన స్థానాల్లో చాతన్నూర్ ఒకటి. కొల్లాం జిల్లాలోని చాతన్నూర్ నియోజకవర్గం వామపక్షాలు, మితవాద కూటములదే హవా.
అయితే తాజా ఎన్నికల్లో ఆ ఆధిపత్యానికి తెరదించుతూ చాతన్నూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగిరింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ రెండో స్థానానికి పరిమితమైన కషాయ పార్టీ ఈసారి విజయం దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి బీబీ గోపకుమార్ ఈ స్థానం నుంచి 4398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేరళ రాజకీయాల్లో నేమోం నియోజకవర్గం ‘కేరళ వారణాసి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బీజేబీ రెండోసారి (2016 తర్వాత) తిరిగి పట్టు నిలుపుకుంది.
త్రిముఖ పోరు సాగిన ఈ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి వీ శివంకుట్టి (కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్)పై 4978 ఓట్ల తేడాతో నెగ్గారు. గతంలో 2024 సాధారణ ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌కు గట్టిపోనిచ్చారు.
కాళకూటం నియోజకవర్గంలో బీజేపీ ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. మాజీ కేంద్ర మంత్రి వీ మురళీధరన్ 428 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన లెక్కింపులో ఆయన తన సమీప అభ్యర్థి కడకంపల్లి సురేంద్రన్ (ఎల్డిఎఫ్) పై గెలుపొందారు. కాగా, పార్టీ ఓట్లు 2021లో 11.3 శాతం సాధించగా, ఈ పర్యాయం స్వల్పంగా మెరుగుపరచుకొని 11.4 శాతం సాధించాయి.

More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!