
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్ల జిల్లా సోపోర్ పట్టణంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఆపరేషన్ 13 గంటల సుదీర్ఘ కాల్పులతో ముగిసింది.
‘సోపోర్ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా ఇన్ క్రిమినేటింగ్ మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో ఒక ఉగ్రవాదిని పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపునకు అనుబంధంగా ఉన్న ఉస్మాన్‌గా గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోపోర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక సీఆర్‌ఎపీఎఫ్ జవాన్ అమరుకావడంతో పాటు ఓ పౌరుడు మృతి చెందారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సోపోర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఏరివేయడం పోలీసు, భద్రతా దళాలకు పెద్ద విజయమని ఐజీపీ కశ్మీర్ తెలిపింది. సోపోర్‌లోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న 22 మందితో కూడిన జమ్మూకశ్మీర్, ఆర్‌ఆర్, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం ఆదివారం ఉదయం 4 గంటలకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందిన ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల సమయంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాక్కున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
జూలై 11న ఉత్తర కశ్మీర్‌లో నౌగామ్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి సైన్యం జరిపిన దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి ఆర్మీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవంక, జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని ఖుల్‌చోహార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఇలా ఉండగా, ‘కార్యాచరణ’ అమలు చేసేందుకు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు.
నివేదికల ప్రకారం బ్యాట్ (బోర్డర్ యాక్షన్ టీమ్) యాక్షన్‌ను చేపట్టడానికి చొరబడేందుకు భీమ్ బర్ గలీ, నౌషెరా సెక్టార్లలో సాయుధ ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలను నిశితంగా గమనించేందుకు బలగాలు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)తో సమన్వయం చేసుకున్నట్లు నిఘా వర్గాల వర్గాలు పేర్కొన్నాయి.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు