గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అరదిరచే సేవలకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇకపై సేవా రుసుములు వసూలు చేయనున్నది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ఆర్ధికంగా కూడా బలోపేతం అఅయ్యేందుకు సేవల నుంచి రుసుమును వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇకపై ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు సేవా రుసుము వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మీ సేవా కేంద్రాల్లో వసూలు చేస్తున్న మాదిరిగానే సచివాలయాల్లో కూడా వసూలు చేయాలని, మీ సేవ పరిధిలోకి రాని అంశాలపై రూ 15 చొప్పున వసూలు చేస్తారు.
మరోవంక, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు భర్తీ చేయగా మిగిలిన, గతంలో నియమితులైనప్పటికీ ఉద్యోగాలు వదిలిపెట్టిన వారితో కలిపి 13,295 గ్రామ సచివాలయ కార్యదర్శులు, 3,802 వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీటిని భర్తీకి సంబంధిరచి ఈ నెల 15లోగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమయంలోనే పరీక్షల నిర్వహణ తేదీని ఖరారుచేసి, జూలై నెలాఖరులోగా ఫలితాల వెల్లడి, ఆగస్టు ఒకటి నుంచి విధుల్లోకి చేరేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, అన్ని కార్యక్రమాలు వాటి ద్వారానే కొనసాగించడంపైనా దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా సచివాలయ భవనాల నిర్మాణం వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయిరచారు.
గ్రామా సచివాలయం ద్వారా అందించే సేవలు నిర్ధిష్ట సమయంలోగా అందాకాపోతే ఉన్నతాధికారులకు చెప్పేలా, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా ముఖ్యమంత్రికే సమాచారం వెళ్లేలా చూడాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నాలుగు అంశాలను ప్రధానంగా అమలు చేసేలా చూడనున్నారు.
నవరత్నాలకు సంబంధిరచిన లబ్దిదారుల వివరాలు, ధరఖాస్తులు, అమలు, సమస్యలపై సచివాలయాలు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, 543కు మించి ఉన్న సేవల వివరాలు, వచ్చే ఏడాది వరకు అమలు చేసే సంక్షేమ పథకాల కాలండర్‌ను కూడా సచివాలయాల వద్ద ప్రదర్శిరచాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో గ్రామ, పట్టణాల్లో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా సచివాలయాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. వాలంటీర్లకు సంబందించి ఇకపై బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తారు. సమయంలో సరైన కారణాలు చూపకుండా వరుసగా మూడు రోజులు గైర్హాజరైన వాలంటీర్లను విధుల నురచి తొలగిరచాలని కూడా నిర్ణయించారు.
More Stories
చైనాలో ఏపీ, తమిళనాడు ఎంబిబిఎస్ విద్యార్థులకు జైలు శిక్ష
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం