ఇఎస్‌ఐ కుంభకోణంలో  పితాని కుమారుడు 

ఇఎస్‌ఐ కుంభకోణంలో తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకటసురేష్‌ తోపాటు, రాష్ట్ర సచివాలయంలో పురపాలక శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మురళీమోహన్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడి తరువాత కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన పితాని సత్యనారాయణ వద్ద మురళీమోహన్‌ పి,ఎస్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పితాని కుమారుడు వెంకట సురేష్‌తో కలిసి అధికారులను ప్రభావితం చేశారని. ఇఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలలో వీరి పాత్ర కూడా ఉందన్నది ఆరోపిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో వెంకటసురేష్‌ను పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన నివాసం వద్దే ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

మురళీ మోహన్‌ను ఎసిబి అధికారులు సచివాలయంలోనే అత్యంత రహస్యంగా అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు. ఇఎస్‌ఐ కేసులో అతనిని ఇప్పటికే విచారిరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో మురళీతోపాటు వెరకట సురేష్‌ కూడా మురదస్తు బెయిల్‌కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇంకా  తీర్పు రాకమురదే వారిని ఎసిబి అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే, వీరిని అరెస్ట్‌ చేసినట్టు ఎసిబి ప్రకటించలేదు.