బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో కోట్లది రూపాయిల అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. వినియోగంలో ఉన్న లిఫ్టులను చూపి రూ. 2.98 కోట్లు అడ్డంగా దోచేశారని విమర్శించారు. ఈవో సురేష్ బాబు అవినీతి అనకొండలా తయారు కాగా, ఆయన అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీ భాగస్వామ్యం ఉందఅర్హతని ధ్వజమెత్తారు.
అందుకనే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఈవోను కొనసాగిస్తున్నారని మండిపడ్డాయిరు. రాష్ట్రంలోనే ఆదాయంలో రెండో అతిపెద్ద ఆలయం అయిన కనకదుర్గమ్మ గుడిలో అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
గతంలో ఈఓలుగా పని చేసిన ఐఏఎస్ అధికారులు ఆలయాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే., సురేష్ బాబు ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కూతవేటు దూరంలో కమిషనర్ కార్యాలయం ఉన్నా పర్యవేక్షణ కరువయ్యిందని విచారం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయిలు చెల్లిస్తుంటే కనీస తనిఖీలు, ఆడిట్ లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆలయ ప్రాంగణంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న దేవాదాయ మంత్రి ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పైగా ప్రతి విషయంలో ఈవోని వెనకేసుకు రావడం, ఆయన చేసే అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే అందులో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందని అనుమానించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
కరోనా లాక్ డౌన్ కాలంలో గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు చేయించుకున్న అంశానికి సంబంధించి పలు ఆధారాలు చూపారు. మే 26వ తేదీన మల్లిఖార్జున మహామండపంలో అదనపు లిఫ్ట్ ఛాంబర్ నిర్మాణం పేరిట రూ. 2. 98 కోట్లకు బిల్లులు డ్రా చేసినట్టు మహేష్ తెలిపారు. వినియోగంలో ఉన్న లిఫ్టులకు ఏరకంగా బిల్లులు చెల్లించారు? ఇంతకంటే అక్రమం ఏమైనా ఉంటుందా? అంటూ నిలదీశారు.
కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున స్ట్రీట్ వరకు ఫుట్ పాత్ నిర్మాణం పేరిట రూ. 10.23 లక్షలకు వేల బిల్లులు మే 26న చెల్లించారనీ తెలిపారు. ఈ ఫుట్ పాత్ కీ కనకదుర్గమ్మ దేవస్థానానికీ సంబంధం ఏంటో చెప్పాలని కోరారు. ఫుట్ పాత్ నగరపాలక సంస్థో., ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న హైవే ఆధారిటీయో నిర్మించాలనీ., అన్ని బిల్లులు లాక్ డౌన్ సమయంలోనే చెల్లించడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని మహేష్ ప్రశ్నించారు.
ఆలయ మహామండపం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అని ప్రశ్నించారు. నిత్యం ఏదో ఒక పని అని చూపుతూ లక్షలాది రూపాయిలు అక్రమ బిల్లులు పెట్టి దోచుకుంటున్నారుని ఆరోపించారు సీవేజ్ ప్లాంట్ పేరుతో బయటి నుంచి విరాళాలు సేకరించారు. అవి ఏమయ్యాయో తెలియదని వాపోయారు. ప్లాంట్ పేరుతో రూ. 53.69 లక్షల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత