
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. యడియూరప్ప నివాస కార్యాలయం ‘కృష్ణ’లో పలువురు ఉద్యోగులకు కరోనా బారిన పడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నారు.
నగరంలోని కుమార పార్క్ రోడ్డులోని తన అధికార నివాసమైన ‘కావేరీ’లో స్వీయ నిర్బంధలో ఉండనున్నారు. ఇటీవల పదవీకాలం పూర్తైన 16 మంది ఎమ్మెల్సీలకు శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంకు యడియూరప్ప హాజరు కావాల్సి ఉంది.
శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) మొత్తం 198 మంది కార్పొరేటర్లతో యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే వీటన్నింటిని రద్దుచేసుకున్నారు.
రాష్ట్రంలో కోవిడ్-19 సంబంధిత పరిణామాలపై స్వీయ నిర్బంధంలో ఉన్నన్నీ రోజులు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన చర్చిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. ఆయన వినియోగించిన వాహనాలు, నివాస కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు.
‘‘కొన్ని రోజుల పాటు నా ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తా. నా కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందుకే ఈ నిర్ణయం’’ అని ఆయన ప్రకటించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరు భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్‌లైన్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు.
కాగా, యడియూరప్ప కారు డైవర్లతో పాటు ఆయన నివాసమైన ‘దవళగరి’లో పనిచేస్తున్న వంట చేసే వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కావడంతో గత నెలలో ముఖ్యమంత్రి నివాస కార్యాలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో నివాస కార్యాలయంలో నిర్వహించాల్సిన సమావేశాలన్నీంటినీ రాష్ట్ర సచివాలయంలోకి మార్చారు.
More Stories
దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
పాకిస్థాన్ ను నాలుగు దేశాలుగా విడగొట్టాలి!