కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విందు, వినోదాలు చేసుకుంటున్న వైనంపై తెలంగాణ డిజిపి మహేంద్ర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలకు నాడు డిజిపి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫంక్షన్ల, వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్‌పిలకు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సడలించాక కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఎన్నివిధాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిబంధనలను పెడచెవిన పెడుతుండటంపై డిజిపి సీరియస్ అయ్యారు.
తాజాగా నగరం లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువు హోటల్లో రేవ్‌పార్టీ, మరో వ్యాపారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అలాగే ఎల్ బి నగర్ లో ఓ బర్త్‌డే కారణంగా వైరస్ సోకిందని, అలాగే ఓ అపార్ట్‌మెంట్‌లోనూ బర్త్‌డే కారణంగా కొందరికి కరోనా పాజిటివ్ సోకింది.
అలాగే ధూల్‌పేటలో ఓ వివాహ కార్యక్రమంలో 20మందికి ఒకేసారి కరోనా సోకిందని, ఇలాంటివి నివారించేందుకు ఫంక్షన్ల అనుమతులను కఠిన తరం చేయాలని నిర్ణయం తీసుకున్నమని డిజిపి తెలిపారు
ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే ఇలాంటి వేడుకలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలోకి వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులేకుండా వచ్చినా గుంపులుగా ప్రవేశించినా ఎపిడమిక్ యాక్ట్ 51(బి) ప్రకారం కేసుల నమోదు, రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
More Stories
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!