10 వేల ఉద్యోగులను తొలగించిన కేసీఆర్ 

అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగుల అందరి ఉద్యోగాలను క్రమబద్దం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు  ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్ సింగ్ ఉద్యోగాలు ఉండవని, వాళ్లందరినీ రెగ్యులరైజ్ చేస్తమని  యువతలో కల్పించిన ఆశలు అడియాసలయ్యాయి.  

ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగాలు అందరిని క్రమంగా ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సాకుతో సుమారు 10,000 మందిని ఇంటికి పంపారు. మరో 11,000 మందికి  పనిచేస్తీనే జీతం అన్న విధానంతో  జీతాలు ఇవ్వడం లేదు. 

తెలంగాణ రాగానే మొదటి ఏడాదే కొత్తగా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు దాటినా ఒక లక్ష మందికి కూడా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు. 

లాక్‌‌డౌన్‌ తర్వాత ఏర్పడిన ఆర్థిక లోటును సాకుగా చూపి వాళ్లపై ఇంకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 3 నెలల కాలంలో  ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ విభాగాలలో ‌ సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేశా. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో పని చేస్తున్న మరో 11 వేల మందికి ‘నో వర్క్.. నో పే’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంకొన్ని శాఖల్లోని కాంట్రాక్టులు ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తున్నారు. 

మిషన్ భగీరథ పథకం కోసం బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను 2015లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వీరందరిని జులై 1 న ఇంటికి పంపారు.

హార్టికల్చర్ డిపార్ట్‌ మెంట్లో ఔట్‌‌ సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా సుమారు 500 మంది పని చేసేవారు. బడ్జెట్ సాకుగా చూపి వీళ్లందరికీ ఏప్రిల్‌‌లో కాంట్రాక్టు రెన్యువల్ చేయలేదు. అప్పటికే 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 

 కరోనా వల్ల మూతబడిన స్కూళ్లు, కాలేజీలు, వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పని లేకపోవడంతో సర్కారు జీతాలివ్వడం లేదు. టూరిజం శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆ శాఖ సగం జీతమే ఇస్తోంది.