గతంలో ఉస్మానియా ఆస్పత్రిని కూలగొట్టి, అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతానని సీఎం మాటిచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించే బదులు ఉస్మానియా హాస్పటల్ నిర్మాణం పూర్తయి ఉంటే, ప్రజల ప్రాణాలను కాపాడేదని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తుండగా, ప్రజలంతా భయం గుప్పెట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతుంటే సచివాలయం కూల్చివేత, డిజైనింగ్ కాంట్రాక్టుల పట్ల ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించడం వెనకున్న మర్మం ఏంటని సంజయ్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో లక్షలాదిమంది కరోనా బారినపడి ఆసుపత్రులు లేక, సరైన వైద్య సదుపాయం లేక, ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో ప్రజలు ప్రాణాలతో అల్లాడుతుంటే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి సచివాలయం కూల్చివేతపై సమయాన్ని కేటాయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
కాగా, సచివాలయం కూల్చివేత కేసీఆర్ ప్రభుత్వ ఉన్మాద చర్యని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే సచివాలయం నిర్మాణమే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. సచివాలయానికే వెళ్లని కేసీఆర్‌కు నూతన సచివాలయం ఎందుకని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేనప్పుడు, సచివాలయం ఎలా కడుతున్నారని నిలదీశారు. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
More Stories
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి