’డిజిటల్ స్ట్రైక్‘లో భాగంగా 59 చైనా యాప్స్‌ను భారత్ నిషేధించిన తరుణంలో దేశీయ వినోద యాప్స్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నయంగా షేర్‌చాట్ తీసుకొచ్చిన ‘మోజ్’ అనే యాప్ విశేష ఆదరణ పొందుతోంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో 4.2 రేటింగ్‌తో అత్యధిక డౌన్లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఈ యాప్ తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళంతో పాటు మొత్తం 15 భారతీయ భాషలతో ఈ యాప్‌ను రూపొందించారు. ఆంగ్ల భాష ఈ యాప్‌లో ఉండదు.
టిక్‌టాక్‌లో మాదిరిగానే ఈ యాప్‌లో సొంతంగా వీడియోలు 15 సెకన్ల నిడివితో సృష్టించవచ్చు. ఫిల్టర్స్, స్టిక్కర్స్, ఎమోటికన్స్ వంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లిప్‌సింకింగ్ అనే ఆప్షన్‌తో సినిమా డైలాగ్స్‌ను టిక్‌టాక్‌లో మాదిరిగానే అనుకరించవచ్చు.
ఇక, గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ ట్రెండింగ్ అప్లికేషన్లలో ఒకటిగా ‘రోపోసో’ నిలించింది. గురుగ్రామ్‌కు చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘రోపోసో’ అయితే డౌన్‌లోడ్లలో దూసుకుపోతోంది. చైనా యాప్‌లను నిషేధించిన రెండు రోజుల్లోనే ఏకంగా 22 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
2014లో ఈ యాప్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉంది. నెలకు 80 వేలకు పైగా వీడియోలు క్రియేట్ అవుతున్నాయి. గత మూడు వారాలుగా రోపోసో యాప్ రోజుకు ఏడు లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా అయితే ఇది మరింత పెరిగింది.
ప్రస్తుతం సగటును గంటలకు ఆరు లక్షల ఇన్‌స్టాళ్లు అవుతున్నట్టు రోపోసో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మయాంక్ భంగాడియా తెలిపారు. రోపోసోతో పాటు ఇతర ఇండియన్ యాప్స్ అయిన షేర్‌చాట్, చింగారీ, మిత్రోన్ తదితర వాటి డౌన్‌లోడ్లు కూడా బాగా పెరిగాయి.
More Stories
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!
14 వరద బాధిత రాష్ట్రాలకు రూ. 5858 కోట్లు విడుదల
టాటా గ్రూప్‌లోని రెండు ఎయిర్‌లైన్స్ విలీనం