చైనా వస్తువులు బహిష్కరణకై డిజిటల్ సంతకాలు  

లడఖ్ వద్ద 20 మంది భారత సైనికుల మరణానికి దారితీసిన భారత్- చైనా సేనల మధ్య ఘర్షణకు ముందే చైనా వస్తువులు బహిష్కరించాలని కోరుతూ స్వదేశీ జాగరణ మంచ్ డిజిటల్ సంతకాల సేకరణను చేపట్టింది. మే 20న ప్రారంభించిన స్వదేశీ స్వావలంబన్ అభియాన్ ప్రచారంలో భాగంగా  ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇప్పటికే 10 లక్షల మందికి పైగా డిజిటల్ సంతకం చేసి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడుతామని ప్రతిజ్ఞ చేసారు. వినియోగదారులలో స్వదేశీ మరియు స్వావలంబన మేల్కొలుపు మరియు నిబద్ధతను రేకెత్తించడమే ‘స్వదేశీ స్వావాలంబన్ అభియాన్’ యొక్క ముఖ్య లక్ష్యం.

చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులవారు, ఆహార తయారీ పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, ఇతర వ్యవసాయేతర కార్యకలాపాలతో స్వదేశీ పరిశ్రమలలో చైతన్యం నింపడం ద్వారా స్వదేశీ స్వావలంబన సాధించాలని సూచిస్తున్నారు. మనం దేశంలోని దాదాపు 700 జిల్లాలకు స్వదేశీ ఉద్యమం ద్వారా చేరుకొంటున్నారు.

ఈ కాలంలో, టీవీ ఛానెల్స్, సివిల్ సొసైటీ సంస్థలు నిర్వహించిన సర్వేలలో, దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరూ స్వదేశీని ఉపయోగించుకుంటామని, చైనాకు సంబంధించిన ప్రతీ దానిని బహిష్కరిస్థామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

ఆమోద మార్గాన్ని అనుసరించడం తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. ఆ తరువాత చైనా నుండి దిగుమతులపై అనేక ఆంక్షలు విధించిన తరువాత, చైనా కంపెనీల టెండర్లను పెద్ద సంఖ్యలో రద్దు చేస్తున్నారు. గత వారమే భారత ప్రభత్వం 59 చైనీస్ యాపులపై నిషేధం విధించింది.

స్వదేశీ అభియాన్ ప్రారంభించిన ఈ ఒకటిన్నర నెలలో, చిన్న పరిశ్రమలలో చైతన్యం నింపే ఉద్దేశ్యంతో కార్మికులను, రైతులను, చిన్న తరహా పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను, సాంకేతిక నిపుణులను, పరిశ్రమ, వాణిజ్య నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలను ఈ అభియాన్ లో చేర్చే ప్రక్రియ ప్రారంభించారు.

వివిధ సంస్థల మరియు సంఘాల సహకారంతో, ప్రజలలోకి వెళ్ళి స్వదేశీ / స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే కాకుండా వాటికి సంభందించిన ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అందుకోసం పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, వ్యాపార వాణిజ్య వ్యక్తులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రపంచీకరణ యుగంలో నిర్లక్ష్యంకు గురైన స్థానిక పరిశ్రమలను పునరుద్ధరించడానికి, సంక్షేమం, స్థిరమైన ఆదాయాలు, ఉద్యోగ కల్పనకు సహాయపడే, మొత్తం మీద ప్రజలలో విశ్వాసం కలిగించే ఆర్థిక విధానాలను రూపొందించడానికి స్వదేశీ ఉద్యమంకు ప్రస్తుతం అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తున్నారు.

దేశంలో 700 కి పైగా ఎంఎస్ఎంఇ క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ సమూహాలకు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన సుదీర్ఘ, పన్న చరిత్ర ఉంది. చైనా నుండి అవినీతికర పోటీ, దిగుమతుల కారణంగా ఈ పారిశ్రామిక సమూహాలలో చాలా మంది తమ ఉనికిని కోల్పోయారు.

ఇటువంటి వారికి అన్ని విధాలుగా మద్ధతునివ్వడం తిరిగి వారి ఉనికిని చాటుకోవడానికి అన్ని రకాలుగా సహాయక చర్యలను అంధించడం ద్వారా వారు ఉపాధి అవకాశాలను సృష్టించటమే కాకుండా అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అత్యంత ఆర్థిక వ్యయంతో ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో ఉత్పాదక వృద్ధిని సాధించడానికి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఇలాంటి మరిన్ని పారిశ్రామిక సమూహాలను గుర్తిస్తారు.

భారత్ స్వయం ప్రతిపత్తిలో గ్రామీణ హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహార తయారీ పరిశ్రమలు, కోళ్ళ, పాడి, చేపల, పుట్టగొడుగుల పెంపకం, వెదురు పెంపకం, ఫ్లోరి కల్చర్, హార్టికల్చర్, ఇతరత్ర పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

సమగ్ర గ్రామీణాభివృద్ధి దిశగా అడుగులు వేయడం, సమగ్ర గ్రామీణ ఆర్థిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించడమే స్వదేశీ స్వావలంబన ఉద్యమం యొక్క తక్షన కర్తవ్యంగా చెబుతున్నారు.

ఈ స్వదేశీ స్వావాలంబన్ అభియాన్ ద్వార స్థానిక, చిన్న తరహా తయారీదారులను, చేతివృత్తులవారిని, చిన్న వ్యాపారాలను ఒక్క తాటిపైకి తెచ్చే అరుదైన సమయం ఇది. పరిశ్రమల సమస్యలను గుర్తించడానికి స్వదేశీ జాగరణ మంచ్ ఇప్పటికే అనేక క్లస్టర్ అధ్యయనాలు చేసింది.

ప్రస్తుత రోజులకు అనుగూణంగా, స్థానిక పరిశ్రమలను మరియు దేశీయ పరిశ్రమను పునరుద్ధరించడానికి ఇటువంటి మరిన్ని అధ్యయనాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో విజయవంతమైన ప్రయోగాలను పట్టణాలలో ప్రచురింపచేసి పట్టణ ప్రజలను కూడా ఆహార పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల వినియోగం పట్ల అవగహన కల్పించే ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తున్నారు.