కరోనాపై పోరాటానికి డీఆర్డీఓ 70కిపైగా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేస్తుందని డీఆర్డీఓ (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) చైర్మన్ డా. జీ సతీశ్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ కంటోన్‌మెంట్ పరిధిలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో సర్దార్ వల్లాభాయ్‌పటేల్ కొవిడ్-19 తాత్కాలిక దవాఖానను కేవలం 11రోజుల్లో ఏర్పాటు చేశామని, ఇందులో వెయ్యి పడకలతో సహా 250 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయనిచెప్పారు. దవాఖానలో అన్నివసతులు ఉన్నాయని, రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నా
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందర్శించారు. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ కూడా ఈ ఆస్పత్రిని సందర్శించారు.
డిఆర్‌డిఒతో కలిసి సైనిక దళాల వైద్య సిబ్బంది ఈ ఆస్పత్రిని నిర్వహిస్తాయి. ఢిల్లీ ప్రజల అవసరాలను గుర్తించిన ప్రధాని మోడీ ఈ హాస్పిటల్ ఏర్పాటు పట్ల ఎంతో శ్రద్ధ చూపారని అమిత్‌షా పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞలు తెలుపుతూ కేజ్రీవాల్ కూడా ట్విట్ చేశారు. ఆర్మీ ఉద్యోగులు ఇక్కడ 24 గంటల సేవలు అందిస్తారు.
చెత్త డంపింగ్ యార్డును చదును చేసి ఈ హాస్పటల్‌ను ఏర్పాటు చేశామని సతీశ్‌కుమార్ తెలిపారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో నెలకు 25 వేలకుపైగా వెంటిలేటర్లను తయారు చేస్తున్నామని, వీటిని ఎగుమతి చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, కరోనాపై పోరాడేందుకు సంస్థ ఆధ్వర్యంలో త్వరలో 70పైగా స్వదేశీ తయారీ ఉత్పత్తులు తయారు చేస్తామని వెల్లడించారు.
More Stories
ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!