
ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీసులు భారీ ఝలక్ ఇచ్చారు. కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం మెరుపు దాడులు చేయగా, వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా పలువురు తప్పించుకున్నారు
కంధమాల్ జిల్లా సిర్లా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. . పోలీసుల కాల్పుల్లో మృతిచెందినవారిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
జిల్లా వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలో అడవుల్లో కూబింగ్ నిర్వహించింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులపై గతంలో ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. వీరు బంశధార-ఘుముసారా-నాగావళి (బీజీఎన్) డివిజన్‌కు చెందిన మావోయిస్టులగా గుర్తించారు.
పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్టు తెలుస్తోంది. పలువురు అగ్రనేతలు కూడా తప్పించుకున్నట్టు భావిస్తున్నారు. కూబింగ్ ఇంకా కొనసాగుతోంది.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి