తెలుగు రాష్ట్రాల్లో 20రూట్లలో ప్రైవేటు రైళ్లు

తెలుగు రాష్ట్రాల్లో 21 రూట్లలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. వీటిలో అత్యధికభాగం సికింద్రాబాద్‌ నుండి ప్రారంభమయ్యేవి ఉన్నాయి. రైల్వేశాఖ జారీ చేసిన అర్హతకు అభ్యర్థన ( రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌- ఆర్‌ఎఫ్‌క్యూ)లో ఈ విషయం పేర్కొంది. 
 
రైళ్ల ప్రైవేటీకరణలో నిజానికి ఈ ప్రక్రియే అత్యంత కీలకమైనది. లాభదాయకమైన రూటు కాకపోతే రైళ్ల నిర్వహణకు ప్రైవేటు ఆపరేటరు ముందుకు వచ్చే అవకాశమేలేదు. దీనిని దృష్టిలో పెంచుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ప్రైవేటు ఆపరేటర్ల కోసందేశ వ్యాప్తంగా 109 జతల రూట్లను గుర్తించింది. 
 
వీటిలో ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణల్లో 21 ఉన్నాయి. దీనికోసం ప్రస్తుతమున్న భారతీయ రైల్వే వ్యవస్థను 12 క్లస్టర్లుగా కేంద్రం విభజిచంచింది. క్లస్టర్ల వారీగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాల్సిన రూట్లను గుర్తించింది.

ముంబాయిని రెండు క్లస్టర్లుగా రైల్వేశాఖ గుర్తించింది. మొదటి క్లస్టర్‌లో 16 రూట్లు, రెండవ క్లస్టర్‌లో 23 రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించనున్నారు. అదే విధంగా ఢిల్లీా1 క్లస్టర్‌లో 14, ఢిల్ల్లీ2 క్లస్టర్‌లో 12, ఛండీగర్‌ క్లస్టర్‌లో 17,హౌరాలో 22, పాట్నాలో 20 రూట్లను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు రైల్వేశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రయాగ్‌రాజ్‌ క్లస్టర్‌లో 26, సికింంద్రాబాద్‌లో 20, జైపూర్‌ క్లస్టర్‌లో 18, బెంగళూరులో పది రూట్లను ప్రైవేటు ఆపరేట్లకు అప్పగించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో రైళ్లను నడపడం కోసం ప్రైవేటు ఆపరేటర్ల నుండి రైల్వేశాఖ ఆసక్తివ్యక్తీకరణను కోరింది. రైలు ఏ టైమ్‌కు బయలుదేరాలి, ఎన్నిగంటలకు గమ్యం చేరాలి, మొత్తం ప్రయాణానికి ఎంత సమయం తీసుకోవాలన్న అంశాలను కూడా రైల్వేశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

రూట్ల వివరాలు
1. సికింద్రాబద్‌ టు శ్రీకాకుళం (వయా విశాఖ) 13.45 గంటలు (19.45-9.30)
2. శ్రీకాకుళం టు సికింద్రాబాద్‌ (వయా విశాఖ)14 గంటలు (15.00-05.00)
3.సికింద్రాబాద్‌ టు తిరుపతి 12.15 గంటలు (06.00-18.15)
4. తిరుపతి టు సికింద్రాబాద్‌ 12.15 గంటలు (08.40-20.55)
5.గుంటూరు టు సికాంద్రాబాద్‌ 4.45 గంటలు (23.30-04.15)
6.సికింద్రాబాద్‌ టు గుంటూరు 4.45 గంటలు (23.30-04.15)
7.గుంటూరు టు కర్నూలు 8 గంటలు ( (06.00ా14.00)
8. కర్నూలు టు గుంటూరు 7.40 గంటలు ( 14.50 ా22.30)
9. తిరుపతి టు వారణాశి (వయా సికింద్రాబాద్‌) 33.45 గంటలు ((22.00 – 7.45)
10. వారణాశి టు తిరుపతి (వయా సికింద్రాబాద్‌)33.15 గంటలు (9.45 – 21.00)
11.సికింద్రాబాద్‌ టు ముంబాయి 11.20 గంటలు (22.25-9.45)
12. ముంబాయి టు సికింద్రాబాద్‌ 11.45 గంటలు (23.35 -11.20)
13. ముంబాయి టు ఔరంగాబాద్‌ 6 గంటలు ( 15.45 ా21.45)
14. ఔరంగబాద్‌ టు ముంబాయి 6.10 గంటలు (6.15 ా12.25)
15.విశాఖపట్నం టు విజయవాడ 6.05 గంటలు (8.40 ా14.45)
16. విజయవాడ టు విశాఖపట్నం 6.05 గంటలు (16.00 ా22.05)
17.విశాఖపట్నం టు బెంగళూరు (వయా రేణిగుంట) 16.45 గంటలు (19.45ా12.30)
18. బెంగళూరు టు విశాఖపట్నం 17.55 గంటలు (18.00ా11.55)
19. హౌరా టు సికింద్రాబాద్‌ 25.20 గంటలు (18.40 – 20.00
20. సికింద్రాబాద్‌ టు హౌరా 25.30 (05-06.30)