టీవీ-9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. గతంలో బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు తాజా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించేందుకు త్వరలోనే సమన్లు జారీ చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్‌డ్రా చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్‌పై నిరుడు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం గత అక్టోబరులో ఆయన్ని అరెస్ట్ చేశారు.
రవిప్రకాశ్‌పై మోపిన అభియోగాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.

More Stories
రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు మృతి
‘ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితాలో ఆధిక్యంలో మహిళా ఓటర్లు!