నిర్బంధంగా చైనాలో ముస్లిం జనాభా తగ్గింపు 

ఉయ్‌ఘర్‌ ముస్లింల జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైనా ప్రభుత్వం నిరంకుశమైన చర్యలకు పాల్పడుతున్నది.  ముస్లిం మైనారిటీల  జనాభాను అదుపు చేసేందుకు బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలతో పాటు గర్భస్రావాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నది.    

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయ్‌ఘర్‌ జనాభా ఎక్కువగా ఉంటుంది.  ఈ మతానికి చెందిన మహిళలే లక్ష్యంగా వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు (ఐయూడీ) వాడాలని చైనా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు అసోసియేట్ ప్రెస్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది.  గత నాలుగేళ్లుగా ఒక మతం వారిని దారుణంగా ఊచకోత విధించడంగా కొందరు నిపుణులు అభివర్ణిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా జనాభా నియంత్రణకు కుటుంభం నియంత్రణ ఒపెరాటేన్లు చేయడం, సంతాన నిరోధక పరికరాలను వాడడం గణనీయంగా తగ్గుముఖం పట్టినా ఈ ప్రాంతంలో పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు సహితం వెల్లడి చేస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిరుని నిర్బంధ శిబిరాలకు పంపుతున్నట్లు కనుగొన్నారు.
భారీ జరిమానాలు చెల్లిస్తే తప్పా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లితండ్రులను ఈ శిబిరాలకు పంపుతున్నారు. పోలీసులు ఇళ్లపై దాడులు చేసి, తల్లితండ్రులను భయపెట్టి ఇళ్లల్లో ఎంతమని పిల్లలు ఉన్నారో అని ఆరా తీస్తున్నారు.
ఎక్కువ మంది పిల్లలు ఉన్న సుమారు 10 లక్షల మంది నిర్బంధ శిబిరాలలో ఉంచినట్లు తెలుస్తున్నది. “మమ్ములను మనుషులుగా ధ్వంసం చేయాలి అనుకొంటున్నారు” అంటూ ఒక మహిళా ఆవేదనతో చెప్పింది. వేలాది మంది మహిళలకు గర్భస్త్రావం చేయిస్తున్నారని తేలింది.
ఉయ్‌ఘర్‌  ప్రాంతంలోని హోటన్, క్సిన్జియాంగ్ లలో  జననాల రేట్ 2015 నుండి ప్రభుత్వ గణాంకాలు లభిస్తున్న 2018 వరకు 60 శాతంకు పైగా తగ్గాయి. జాతీయ స్థాయిలో 4.2 శాతం మాత్రమే తగ్గగా క్సిన్జియాంగ్ లో గత ఏడాది 24 శాతం జననాల రేట్ తగ్గాయి. 
ఈ విధంగా జననాల రేట్ తగ్గడం అసాధారణమని చైనాలో మైనారిటీ ప్రాంతాల నిపుణుడు అడ్రియన్ జెన్జ్ పేర్కొన్నారు. ఇటువంటి దారుణమైన విధానాన్ని వెంటనే నిలిపి వేయాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి  అమెరికా విదేశాంగ కార్యదర్శి మైఖేల్ పొంప్యూ స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో   చైనాపై విచారణకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని  మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి.  షిన్‌జియాంగ్‌లో ముస్లిం జనాభాను కట్టడి చేయడం కోసం చైనా ప్రభుత్వం ‌ భారీగా   ఖర్చుచేస్తున్నట్లు   తెలుస్తున్నది. 2014లో జిన్ పిన్ క్సిన్జియాంగ్ లో పర్యటించగానే “సమాన కుటుంభం నియంత్రణ విధానాలు అమలు చేసే సమయం వచ్చింది” అని స్థానిక ఉన్నతాధికారులు ప్రకటించారు. జనన రేట్ లను తగ్గించి, స్థిరీకరింపనున్నట్లు తెలిపారు.
అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తున్నది. వీటికి సరైన ఆధారాలు లేవని కొట్టిపారేసింది.  10 లక్షల మంది ఉయ్‌ఘర్‌ ముస్లింలను, ఇతర ముస్లిం వర్గాల ప్రజలను  పశ్చిమ షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో  నిర్బంధించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్యసమితి గత ఆగస్టులో పేర్కొంది.  ఐతే అవన్నీ పునర్విద్యా శిబిరాలని  చైనా వాదిస్తున్నది.