కాశ్మీర్ లో విధ్వంసానికి పాక్ తో చైనా కుట్ర

ఒకవైపు లడఖ్‌ ప్రాంతంలో  ఉద్రిక్తతల తగ్గింపుపై భారత్ తో చర్చలు జరుపుతున్న చైనా మరోవైపు జమ్మూ కాశ్మీర్‌‌లో హింసను ప్రేరేంపించేందుకు పాకిస్తాన్‌తో జత కడుతోందని తెలుస్తోంది. ఈ మేరకు డ్రాగన్ కంట్రీకి మద్దతుగా, భారత్ పై దాడి చేయడానికి గిల్గిత్ బాల్టిస్తాన్‌ నుంచి పాక్ తన దళాలను ముందుకు తీసుకెళ్తోందని నిఘా వర్గాలు తెలిపారు. 
 
ఉగ్రవాద సంస్థ అల్‌ బద్ర్‌‌తో కలసి జమ్మూ కాశ్మీర్‌‌లో హింసకు డ్రాగన్ కంట్రీ చర్చలు జరుపుతోందని తెలిసింది. ఉత్తర  కాశ్మీర్ ప్రాంతంలో  చైనా మోహరింపులకు సమానంగా పాకిస్తాన్ కూడా అదనంగా 20 వేల దళాలను సమాయత్తం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
భారత్ మీద రెండు వైపుల నుంచి దాడి చేయాలని కుటిల పాక్ వ్యూహాలు పన్నుతోందని తెలిసింది. దాయాదితో దాగున్న ప్రమాదం గురించి చర్చించడానికి మన దేశ నిఘా, సైనిక అధికారుల మధ్య వరుసగా కొన్ని సమావేశాలు  కూడా జరిగాయి.
 
భారత్ లో బ్యాట్ ఆపరేషన్స్‌ కోసం పాకిస్తాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరోవంక, 100 మంది ఉగ్రవాదులతో కాశ్మీర్‌‌లో విధ్వంసం సృష్టించాలని వారు చర్చిస్తున్నాయని తెలిసింది.