దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్ కల్యాణ్ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.
గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. గడిచిన 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజల కుటుంబాలకు రూ. 31 వేల కోట్లను డిపాజిట్ చేశామన్నారు. అదేవిధంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లను జమచేసినట్లు ప్రధాని పేర్కొన్నారు.
కాగా, లాక్‌డౌన్1లో ప్రజల్లో నిర్లక్ష్యం బాగా పెరిగిందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు వాడటం, సాంఘికదూరం పాటించడం అన్నివేశారని చెబుతూ ఇది ప్రమాదకరమని హితవు చెప్పారు.
అన్‌లాక్ 2లోకి ప్రవేశిస్తున్నందున మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించాలని చెప్పారు. కచ్చితంగా నియమాలు పాటించాలని చెబుతూ సరైన సమయంలో లాక్‌డౌన్ పెట్టడం వల్ల చాలా కేసులు తగ్గాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని మిగతా దేశాలలో పోలిస్తే భారత్ చాలా స్థిరమైన పరిస్థితిలో ఉన్నదని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
భారత్ లో మరణ స్థాయి కూడా నియంత్రణలో ఉందని తెలిపారు. దేశంలోని ప్రతి ఒకరు నిబంధలు పాటించాలని, నిబంధనలకు ఎవరూ అతీతులు కారని పేర్కొంటూ లీడర్ ఆఫ్ ది నేషన్ అయినా కూడా కచ్చితంగా నిబంధనలు పాయితఁచవలసిందే అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిలో అవగాహన కలిగించాలని సూచించారు.
More Stories
వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి